ధావన్ అవుట్...

ధావన్ అవుట్...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో పర్యాటక టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 244 పరుగుల వియలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ శిఖర్‌ ధావన్ మంచి ఆరంభం ఇచ్చాడు. బౌండరీలు బాదుతూ దూకుడు మీదున్న శిఖర్‌ ధావన్ ను కివీస్ స్టార్ పేసర్ బౌల్ట్‌ పెవిలియన్ చేర్చాడు. బౌల్ట్‌ వేసిన 9 ఓవర్లో ధావన్‌ (28) రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ(31), కెప్టెన్ విరాట్ కోహ్లీ (10)లు ఉన్నారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాదించాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి.