వీడియో: పాండ్య స్టన్నింగ్ క్యాచ్

వీడియో: పాండ్య స్టన్నింగ్  క్యాచ్

మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ సస్పెన్షన్‌ ఎత్తివేసిన తర్వాత పాండ్య తిరిగి మూడో వన్డేలో ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్ లో కివీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయిన అనంతరం టేలర్‌తో కలిసి కెప్టెన్ విలియమ్సన్‌ నిలకడగా ఆడుతున్నాడు. అయితే 17 ఓవర్లో చాహల్‌ వేసిన బంతిని విలియమ్సన్‌ లెగ్ సైడ్ భారీ షాట్‌ ఆడాడు. వేగంగా దూసుకెళ్తున్న బంతిని పాండ్య గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. దీంతో విలియమ్సన్‌ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్స్ పెడుతూ.. పాండ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఇది కచ్చితంగా ఫీల్డర్ వికెట్, పాండ్య అద్భుత క్యాచ్ పట్టాడు' అని భారత మాజీ క్రికెటర్ కైఫ్ ట్వీటాడు.