మూడో వన్డే: గప్తిల్ అవుట్

మూడో వన్డే: గప్తిల్ అవుట్

మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగతున్న మూడో వన్డేలో కివీస్‌ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ (13) పెవిలియన్‌ చేరాడు. భువనేశ్వర్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికే కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి గప్తిల్ పెవీలియన్ చేరాడు. అంతకుముందు షమీ వేసిన రెండో ఓవర్‌ చివరి బంతికి మన్రో(7) రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (24), రాస్‌ టేలర్‌ (4)లు ఉన్నారు.