రోహిత్, కోహ్లీ హాఫ్ సెంచ‌రీలు

రోహిత్, కోహ్లీ హాఫ్ సెంచ‌రీలు

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో టీమిండియా ఓపెనర్ 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు అర్ధ శ‌త‌కాలు చేశారు. దీంతో టీమిండియా విజ‌యం దిశ‌గా దీసుకెళ్తోంది. 244 పరుగుల విజ‌యలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ (23) దూకుడుగా ఆడుతూ భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ధావన్ అవుటైనా.. రోహిత్, కోహ్లీలు అర్ధ శ‌త‌కాలు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్, కోహ్లీలు రెండో వికెట్ కు ఇప్పటికే 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో రోహిత్‌ శర్మ(62), కెప్టెన్ విరాట్ కోహ్లీ (51)లు పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్ర‌స్తుతం 27 ఓవర్ల‌లో ఒక వికెట్ కోల్పోయి 145 ప‌రుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 99 పరుగులు చేయాలి.