రోహిత్, కోహ్లీ అవుట్.. స్కోర్ 171/3

రోహిత్, కోహ్లీ అవుట్.. స్కోర్ 171/3

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో టీమిండియా 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు అవుట్ అయ్యారు. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ (23) ఆరంభంలోనే అవుటైనా కెప్టెన్ విరాట్ కోహ్లీతో క‌లిసి రోహిత్ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. రోహిత్ 63 బంతుల్లో అర్ధశతకం సాధించి టీమిండియాను మెరుగైన స్థితిలో నిలిపాడు. అర్ధ శ‌త‌కం అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ (62) స్టంప్ అవుట్ అయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే కోహ్లీ (60) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. క్రీజులో అంబటి రాయుడు (14), దినేష్ కార్తీక్  (2)లు ఉన్నారు. టీమిండియా ప్ర‌స్తుతం 32 ఓవర్ల‌లో మూడు వికెట్ల నష్టానికి 171 ప‌రుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 73 పరుగులు చేయాలి.