మొదటి వికెట్ కోల్పోయిన కివీస్

మొదటి వికెట్ కోల్పోయిన కివీస్

మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగతున్న మూడో వన్డేలో కివీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కొలిన్ మున్రో (7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి రోహిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజ్ లో మార్టిన్ గప్టిల్ (3), కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (1)లు ఉన్నారు.