హమ్మయ్య.. ఒక వికెట్ పడింది

హమ్మయ్య.. ఒక వికెట్ పడింది

హామిల్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న చివరి టీ20లో దూకుడుగా ఆడుతున్న కివీస్‌ ఓపెనర్ టిమ్‌ సీఫెర్ట్‌ (43; 25 బంతుల్లో 3x6, 3x4) అవుట్ అయ్యాడు. బౌండరీలే లక్ష్యంగా ఆడుతున్న సీఫెర్ట్‌ అవుట్ అవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అయితే మరో విధ్వంసక ఓపెనర్ కొలిన్‌ మన్రో (58; 29 బంతుల్లో 4x6, 3x4)) క్రీజులో ఉన్నాడు. కివీస్ ఇద్దరు ఓపెనర్లు బౌండరీల మోత మోగించడంతో రన్ రేట్ 10కి పైగా సాగుతూ వచ్చింది. క్రీజులో కొలిన్‌ మన్రో (58), విలియమ్సన్ (8)లు ఉన్నారు. 11 ఓవర్లు పూర్తి అయ్యే సరికి కివీస్ ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది.