మరో మూడు వికెట్లు.. స్కోర్ 35/5

మరో మూడు వికెట్లు.. స్కోర్ 35/5

సెడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీంఇండియాకు భారీ షాక్ తగిలింది. కీలక ఐదు వికెట్లను కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడింది. 12 ఓవర్ చివరి బంతికి శుభ్‌మాన్ గిల్ (9) క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. కివీస్ బౌలర్ కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌ తాను వేసిన తొలి ఓవర్లోనే చెలరేగాడు. 11వ ఓవర్ రెండో బంతికి రాయుడు (0)ను.. ఐదవ బంతికి కార్తీక్ (0)లను అవుట్ చేసాడు. ఇద్దరూ కూడా క్యాచ్ అవుట్ అయ్యారు. ఇక ట్రెంట్‌ బోల్ట్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి శిఖర్ ధవన్ (13) ఎల్‌బీడబ్ల్యూ అయి పెవిలియన్ చేరాడు. ఎనిమిదో ఓవర్ చివరి బంతికి బోల్ట్ కే క్యాచ్ ఇచ్చి రోహిత్ (7) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేదార్ జాదవ్ (1), హార్దిక్ పాండ్యా (0)లు ఉన్నారు.