ఓపెనర్లను కోల్పోయిన భారత్

ఓపెనర్లను కోల్పోయిన భారత్

సెడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీంఇండియాకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీంఇండియాకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. ట్రెంట్‌ బోల్ట్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి శిఖర్ ధవన్ (13) ఎల్‌బీడబ్ల్యూ అయి పెవిలియన్ చేరాడు. అనంతరం ఎనిమిదో ఓవర్ చివరి బంతికి బోల్ట్ కే క్యాచ్ ఇచ్చి రోహిత్ (7) అవుట్ అయ్యాడు. ఈ రోజు కెరీర్‌లో 200వ వన్డే మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్ సింగల్ డిజిట్ కే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజ్‌లో శుభ్‌మాన్ గిల్ (9), అంబటి రాయుడు (0)లు ఉన్నారు.