బోల్ట్ దెబ్బకు భారత్ ఆలౌట్

బోల్ట్ దెబ్బకు భారత్ ఆలౌట్

హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్ ధాటికి భార‌త్ బ్యాట్స్‌మెన్స్ పెవిలియ‌న్‌కి క్యూ క‌ట్టారు. క్రీజులోకి వ‌చ్చిన బ్యాట్స్‌మెన్స్ వచ్చినట్టే పెవిలియ‌న్‌కి చేరారు. చివరలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ (15), యుజువేంద్ర చాహల్‌ (18*) పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. దీంతో కివీస్ ముందు 93 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భార‌త్‌ 21 ప‌రుగుల వ‌ద్ద శిఖర్ ధావన్ (13) తొలి వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత రోహిత్ శర్మ (7) కూడా పెవిలియన్ చేరాడు. ఇద్దరినీ బోల్ట్ అవుట్ చేసాడు. అనంతరం కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌ ఒకే ఓవ‌ర్ల‌లో అంబటి రాయుడు (0), దినేశ్ కార్తీక్ (0)లను వెనక్కి పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శుభమన్ గిల్ (9)ను బోల్ట్ అవుట్ చేసాడు. ఫాంలో ఉన్న కేదార్ జాద‌వ్‌ (1), భువ‌నేశ్వ‌ర్ (1) కూడా త‌క్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఫోర్లు బాది ఊపుమీదున్న హార్ధిక్ పాండ్యా (16) కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో కుల్ దీప్ యాద‌వ్ ( 15), చాహల్ (18) పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ చేసింది. ఈ ఇద్దరు తొమ్మిదో వికెట్ కు 25 పరుగులు జోడించారు. కుల్దీప్, ఖలీల్ (5) లు పెవిలియన్ చేరడంతో.. భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్ బౌల‌ర్స్‌లో బౌల్ట్ ఐదు వికెట్లు తీయ‌గా, గ్రాండ్‌ హోమ్ మూడు వికెట్లు తీసాడు.