విజృంభించిన పాక్ బౌలర్లు, కష్టాల్లో కివీస్

విజృంభించిన పాక్ బౌలర్లు, కష్టాల్లో కివీస్

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ను పాక్‌ బౌలర్లు కోలుకోలేని దెబ్బ తీశారు. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్(5; 4 బంతుల్లో 1 ఫోరు)ను తన తొలి ఓవర్‌ తొలి బంతికే వెనక్కి పంపించిన అమిర్‌ కివీస్‌ వికెట్ల పతనం ప్రారంభించాడు. అనంతరం మరో లెఫ్టార్మ్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది.. కోలిన్‌ మున్రో(12), రాస్‌ టేలర్‌(3), లాథమ్‌(1)లను పెవిలియనకు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కెప్టెన్ కేన్ విలియమ్స్‌సన్ (41; 69 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో సర్ఫరాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జేమ్స్ నీషమ్(52; 81 బంతుల్లో 2 ఫోర్లు), గ్రాండ్ హోమ్ (39; 53 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్) క్రిజ్ లో ఉన్నారు.