పాకిస్థాన్ టార్గెట్ః 238

పాకిస్థాన్ టార్గెట్ః 238

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్‌ బ్యాట్స్‌మెన్లు కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని పోరాట పటిమ ప్రదర్శించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ను పాక్‌ బౌలర్లు కోలుకోలేని దెబ్బ తీశారు. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్(5; 4 బంతుల్లో 1 ఫోరు)ను తన తొలి ఓవర్‌ తొలి బంతికే వెనక్కి పంపించిన అమిర్‌ కివీస్‌ వికెట్ల పతనం ప్రారంభించాడు. అనంతరం మరో లెఫ్టార్మ్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది.. కోలిన్‌ మున్రో(12), రాస్‌ టేలర్‌(3), లాథమ్‌(1)లను పెవిలియనకు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కెప్టెన్ కేన్ విలియమ్స్‌సన్ (41; 69 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో సర్ఫరాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ నీషమ్‌(97నాటౌట్; 112బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు), గ్రాండ్‌హోమ్‌(64; 71బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు) గొప్ప పోరాటంతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్‌ 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో షాహిద్‌ అఫ్రిది మూడు వికెట్లు, షాదాబ్‌ ఖాన్‌ ఒక వికెట్ తీశారు.