వరల్డ్‌ కప్‌: టాస్‌గెలిచిన న్యూజిలాండ్..

వరల్డ్‌ కప్‌: టాస్‌గెలిచిన న్యూజిలాండ్..

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది... ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగబోతోంది. ఇక, లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా సరికొత్త రికార్డు నెలకొల్పినట్టే.. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియా ఐదు సార్లు, వెస్టిండీస్, టీమిండియా చెరో రెండు సార్లు, శ్రీలంక, పాకిస్థాన్ చెరోసారి వరల్డ్ కప్‌ కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు తలపడుతోన్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్టు ఇప్పటి వరకు వరల్డ్ కప్‌ను అందుకోలేకపోయాయి.. వర్షం అడ్డంకిగా మారకపోతే వరల్డ్ కప్ మరో అడుగు దూరంలోనే ఇరు జట్లను ఊరిస్తోంది.