బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళా కెప్టెన్ అమీ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరపున ఈ మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ జట్టులోకి వచ్చింది. ఇప్పటికే  0-2తో సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించిన హర్మన్‌ప్రీత్‌కౌర్ సేన చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి.. వైట్‌వాష్‌ను తప్పించుకొని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ చూస్తోంది.

భారత జట్టు:

ప్రియా పూనియా, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ, తానియా భాటియా, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్‌, మాన్షి జోషి, పూనమ్‌ యాదవ్‌. 

కివీస్ జట్టు:

సోషి డెవిన్‌, సుజీ బెట్స్‌, అమీ సట్టెర్‌వైట్‌ (కెప్టెన్‌), కెటీ మార్టిన్‌, అన్నా పీటర్సన్‌, కాస్పెర్క్‌, అమెలియా కెర్‌, రోస్‌మెరీ మైర్‌, హైలే జెన్సన్‌, లీ తాహుహు, హన్నా రోవ్‌.