స్మృతి మందాన అర్ధ సెంచరీ

స్మృతి మందాన అర్ధ సెంచరీ

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్‌ మహిళల మధ్య జరిగే తొలి వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అర్ధ సెంచరీ చేసింది. మందాన 43 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 50 పరుగులు చేసింది. 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జెమిమా, మందానలు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ జోడి ఇప్పటికే 98 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 98 పరుగులు చేసింది. క్రీజ్ లో జెమిమా (41), మందాన (52)లు ఉన్నారు. విజయం సాధించాలంటే భారత మహిళలు ఇంకా 95 పరుగులు చేయాలి.