న్యూజిలాండ్‌ ఆలౌట్

న్యూజిలాండ్‌ ఆలౌట్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్‌ మహిళల మధ్య జరిగే తొలి వన్డేలో న్యూజిలాండ్‌ మహిళల జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ ల ధాటికి 48.4 ఓవర్లలో 192 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. దేవినే (28), అమీ (31), అమేలియా (28) రాణించారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ తలో మూడు వికెట్లు తీశారు. 

అనంతరం 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జెమిమా, మందానలు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తిస్తున్నారు. ప్రస్తుతం భారత్ 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్ లో జెమిమా (18), మందాన (17)లు ఉన్నారు.