వరల్డ్ కప్: శ్రీలంకపై కివీస్ ఘనవిజయం

వరల్డ్ కప్: శ్రీలంకపై కివీస్ ఘనవిజయం

ప్రపంచ వరల్డ్ కప్ లో భాగంగా కార్టిఫ్ లోని సోఫియా గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేధించింది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్ (51 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్స్‌లు),  కొలిన్‌ మన్రో( 58; 47 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్) చెలరేగి ఆడారు. వికెట్లు తీయడంలో శ్రీలంక బౌలర్లు ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో శ్రీలంక బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు 136 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాట్స్ మన్లలో కరుణరత్నే 52, కుషల్ పెరీరా 29, తిషారా పెరీరా 27 మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మాట్ హెర్నీ 3, లాకీ ఫెర్గుసన్‌ 3, కొలిన్ డి గ్రాండ్‌హోం, బౌల్ట్, నీశమ్, శాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు.