భారీ లక్ష్యాన్ని ఛేదించిన కివీస్ ...  

భారీ లక్ష్యాన్ని ఛేదించిన కివీస్ ...  

ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ సాధించింది.  శ్రేయాస్ అయ్యర్ (103) రాహుల్ (88) కోహ్లీ (51) రాణించడంతో ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది.  

348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడింది.  ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఆడిన ఆ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి 348 పరుగులు సాధించింది. రాస్ టేలర్ 109 పరుగుతులతో అజేయంగా నిలవగా, నికోల్స్, లెధమ్ లు అర్ధసెంచరీలతో రాణించారు.  మూడు వన్డే సీరీస్ లో న్యూజిలాండ్ మొదటి వన్డేలో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.