మ్యాచ్ పోయే... సిరీస్ పాయే..

మ్యాచ్ పోయే... సిరీస్ పాయే..

ఐదు టీ-20ల సిరీస్‌ను వైట్ వాష్ చేసి... సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను చావుదెబ్బ కొట్టిన టీమిండియా... వన్డే సిరీస్‌లో మాత్రం చేతులెత్తేసింది... తొలి వన్డేలో పరాజయాన్ని చవిచూసిన కోహ్లీ సేన.. రెండో వన్డేలోనూ తన తీరును మార్చుకోలేకపోయింది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి.. భారత్ ముందు 274 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుప్తిల్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా... రాస్ టేలర్ 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక, 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను 251 పరుగుల దగ్గరే ఆలౌట్ అయ్యింది. మ‌యాంక్ అగ‌ర్వాల్‌(3), పృథ్వీ షా(24) పరుగుల వద్దే పెకిలియన్ చేరగా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ (15)కే వెనుదిరిగాడు.. అయితే, శ్రేయ‌స్ అయ్యర్‌(52)తో రాణించి మ్యాచ్‌పై ఆశలు కలిపించాడు.. న‌వ‌దీప్ సైనీ(45) ర‌వీంద్ర జ‌డేజా(55) ధాటిగా ఆడి.. ఇక భారత్ గెలుపు లాంఛనమే అనుకునే వరకు తెచ్చారు. అయితే, సైనీ అవుట్ అవడంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి.. ఆ తర్వాత రవీంద్ర జ‌డేజా కూడా ఔట్ కావడంతో.. రెండో వన్డేలోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. దీంతో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది న్యూజిలాండ్ జట్టు. సొంతగడ్డపై టీ-20 సిరీస్‌ను కోల్పోయిన కివీస్ జట్టు... వన్డే సిరీస్ తన ఖాతాలో వేసుకుని ప్రతీకారం తీర్చుకుంది.