గాంధీ ఆస్పత్రిలో పసికందు విక్రయం..!

గాంధీ ఆస్పత్రిలో పసికందు విక్రయం..!

పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా చూసుకుంటూ పెంచుకోవాల్సిన తల్లిదండ్రులే... అప్పుడే పుట్టిన పసికందును అమ్మకానికి పెట్టారు. కనీసం కన్నుతెరిచి చూడకుండానే దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాడు శిశువు... హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును తల్లిదండ్రులు రూ. లక్షకు విక్రయించినట్టు తెలుస్తోంది. ఆ పసికందును కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నలుగురు సభ్యుల ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు... ఆ ముఠా నుంచి శిశువును కాపాడి ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించింది ఎస్‌వోటీ టీమ్.