ఏపీ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురు..

ఏపీ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక..కడప జిల్లా రాయచోటి  ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమించారు.  రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా,  చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. ఇప్పుడు వీరికి అదనంగా.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.