నేడు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

నేడు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

తెలంగాణలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ  ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేస్తారు. మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ వారితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కాగా, శాసన సభ్యుల కోటా కింద హోం మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, యెగ్గె మల్లేశం టీఆర్ఎస్‌ నుంచి, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్‌ హసన్‌ విజయం సాధించారు. ఇక నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్ర నియోజకవర్గం నుంచి జీవన్‌రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.