కేటీఆర్‌ను కలిసిన కొత్త జడ్పీ ఛైర్మన్లు..

కేటీఆర్‌ను కలిసిన కొత్త జడ్పీ ఛైర్మన్లు..

తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన జడ్పీ ఛైర్మన్లు ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్... ఆ తర్వాత జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలో రాష్ట్రంలోని 32 జడ్పీ ఛైర్మన్ పీఠాలు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఇక నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిన కేటీఆర్ అభినందించారు. 

 కేటీఆర్‌ని కలిసిన జడ్పీ చైర్మన్లు:
1. నాగర్‌ కర్నూల్-పి.పద్మావతి
2. వనపర్తి - లోక్‌నాథ్ రెడ్డి
3. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ - కోవ లక్ష్మి
4. మెదక్ - హేమలత శేఖర్ గౌడ్
5. నల్గొండ- బండ నరేందర్ రెడ్డి
6. యాదాద్రి భువనగిరి- ఎలిమినేటి సందీప్ రెడ్డి
7. సంగారెడ్డి- మంజుశ్రీ
8. వరంగల్ అర్బన్- సుధీర్ కుమార్
9. వరంగల్ రూరల్ - గండ్రజ్యోతి
10. జనగామ-పాగాల సంపత్‌ రెడ్డి
11. ములుగు - కుసుమ జగదీష్
12. మహబూబాబాద్- ఆంగోతు బిందు
13. జయశంకర్ భూపాలపల్లి-జక్కు శ్రీహర్షిణి
14. పెద్దపల్లి- పుట్ట మధు
15.  ఖమ్మం - లింగాల కమల్ రాజ్, తదితరులున్నారు.