నవ వధువుకు కరోనా.. వరుడు సహా బంధువులంతా క్వారంటైన్‌కి..
కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో రోజురోజుకో కొత్త తరహా కేసులు వెలుగు చూస్తున్నాయి.. పెళ్లి చేసుకుని కాపురానికి సిద్ధమైంది ఓ జంట.. ఇదే సమయంలో.. కరోనా లక్షణాలతో బాధపడుతోన్న నవ వధువుకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా తేలింది.. పెళ్లైన రెండు రోజులకే నవ వధువుకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో, వధూవరుల కుటుంబాలతోపాటు, ఆ పెళ్లికి హాజరైనవారిలో ఆందోళన మొదలైంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని జట్ ఖేడి ప్రాంతానికి చెందిన యువతికి రెండు రోజుల క్రితం వివాహం అయ్యింది.. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగానే బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి తంతు ముగించారు.. అయితే, అప్పటికే ఆ యువతి జలుబు, జ్వరంతో బాధపడుతుండగా.. మందులు వాడతంతో కాస్త ఉల్లాసంఘానే గడిపింది.. అయితే, పెళ్లి తర్వాత కరోనా టెస్ట్ నిర్వహిస్తే పాజిటివ్‌గా రావడంతో అంతా షాక్ తిన్నారు. ఇక, అధికారులు వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్లో పెట్టారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)