పాక్ అదుపులో భారత పైలెట్?

    పాక్ అదుపులో భారత పైలెట్?

జమ్ము కశ్మీర్‌లోని బుద్గాంలో బుధవారం మిగ్‌ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని భారత వైమానిక అధికారులు వెల్లడించారు. దీనిపై పాకిస్థాన్ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోకి వచ్చిన రెండు భారత యుద్ద విమానాన్ని కూల్చివేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఈ విమానాలను మా భద్రతా దళాలు పేల్చివేశాయని అందులో ఒక యుద్ద విమానం నియంత్రణ రేఖకు అవతల, మరోకటి పాకిస్థాన్ భూభాగంలో పడిపోయినట్లు తెలిపారు. పైలెట్ ను పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

మిగ్‌ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.