మోడీ నెక్స్ట్ అజెండా ఇదే.. ఆందోళనలో పాక్..!!

మోడీ నెక్స్ట్ అజెండా ఇదే.. ఆందోళనలో పాక్..!!

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో విలీనం అయ్యింది.  దీంతో పాకిస్తాన్ ఆందోళన చెందుతున్నది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వాపోయింది.  అయితే, జమ్మూ కాశ్మీర్ అంశం అన్నది ఇండియా అంతర్గత విషయం అని, ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.  1947 లో ఇండియాకు స్వతంత్రం వచ్చిన తరువాత పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగంగా ఉంది.  ఈ విషయం అందరికి తెలుసు.  పాక్ ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది.  

ఇప్పుడు పాకిస్తాన్ తో చర్చలు జరపాలి అంటే అది కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మాత్రమే చర్చలు జరుపుతామని ఇండియా స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఇండియాలో కలిపేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, మోడీ నెక్స్ట్ అజెండా అదే అని ఆ పార్టీ సీనియర్ నేత.. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు.  ఇది కేవలం బీజేపీ అజెండా మాత్రమే కాదని, 1994 పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఏకగ్రీవంగా దీనిపై తీర్మానం చేసిందని అయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఇండియా అజెండా స్పష్టంగా ఉండటంతో పాక్ ఆందోళన చెందుతోంది.