అసెంబ్లీ నిర్మాణంపై రేపు ప్రభుత్వ వాదనలు..

అసెంబ్లీ నిర్మాణంపై రేపు ప్రభుత్వ వాదనలు..

ఎర్రమంజిల్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అసెంబ్లీ భవనాల సముదాయంపై విచారణ రేపటికి వాయిదా పడింది. పురాతన కట్టడాలను జాబితా నుండి ఎర్రమంజిల్‌లోని కట్టడాలను తొలగిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉత్తర్వులపై సుదీర్ఘ వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది నిరూప్ రెడ్డి. ఇక, ఈ కేసులో రేపు ప్రభుత్వం తరపున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు వాదనలు వినిపించనున్నారు. దీంతో, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.