రివ్యూ: ఎన్జీకే 

రివ్యూ: ఎన్జీకే 

 

నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, బాలా సింగ్‌ తదితరులు

మ్యూజిక్: యువన్‌ శంకర్‌ రాజా
సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌
నిర్మాణ సంస్థ: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌

కోలీవుడ్ లో సూర్యకు ఎలాంటి మార్కెట్ ఉన్నదో మనందరికి తెలిసిందే.  స్టార్ హీరో హోదాను సంపాదించుకున్న ఈ హీరోకు సక్సెస్ రేట్ కొంతకాలంగా వెనకబడింది.  కోలీవుడ్ లో సూర్యకు ఎలాంటి మార్కెట్ ఉన్నదో టాలీవుడ్ లో కూడా ఇంచుమించు అలాంటి మార్కెట్ ఉన్నది.  తెలుగులోను సూర్య హిట్ కొట్టి చాలా కాలం అయింది.  రాజకీయ నేపధ్యం కలిగిన కథతో ఎన్జీకే గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మరి ఈ మూవీ ఎలా ఉందొ చూద్దాం. 

కథ: 

సూర్య ఇంజినీరింగ్ కాలేజీలో పిహెచ్.డి చేసి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు.  సడెన్ గా ఉద్యోగాన్ని మానుకొని ఊరు వెళ్లి వ్యవసాయం మొదలుపెడతారు సూర్య.  తన బాటలోనే కొంతమంది యువకులు కూడా నడిచేందుకు ముందుకు వస్తారు.  సూర్య ఊర్లోని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ పనులు చేస్తుంటాడు.  సూర్య ఆర్గానిక్ వ్యవసాయం కారణంగా స్థానిక ఎమ్మెల్యే ఆదాయాన్ని గండి పడుతుంది.  వ్యవసాయం దెబ్బతినడంతో సూర్య ఎమ్మెల్యే దగ్గర జాయిన్ అవుతాడు.  కార్యకర్తగా జాయిన్ చేయించుకొని వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటుంటాడు ఎమ్మెల్యే.  కానీ, సూర్య కార్యకర్తగా ఉంటూనే రాజకీయం నేర్చుకుంటాడు.  నేర్చుకున్న రాజకీయాన్ని ఎక్కడ ఉపయోగించాడు ..? రాజకీయాల్లో సూర్య లక్ష్యం నెరవేరిందా లేదా..? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

విశ్లేషణ: 

ఒక సామాన్య వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నాయకుడిగా ఎదగడం అన్నది చాలా సినిమాల్లో చూశాం.  ఈ సినిమా కూడా అలాంటి నేపధ్యం కలిగిన సినిమానే.  సెల్వరాఘవన్ గత చిత్రాల లాగే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని అనుకున్నారు.  కొత్తదనం కోసం సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి కొత్తదనం కనిపించకపోగా కాస్త విసుగు తెప్పించే విధంగా ఉంటుంది స్క్రీన్ ప్లే.  సూర్య నటన పరంగా హుషారుగా కనిపించాడు.  ఇదే సినిమాకు ప్లస్ అయ్యింది.  ఎమ్మెల్యే జీవితం  ఎలా ఉంటుంది.  ఎమ్మెల్యే దగ్గర పనిచేసే అనుచరుల జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను ఇందులో చూపించారు.  ఫస్ట్ హాఫ్ కొంత ఆసక్తిగా ఉన్నా, సెకండ్ హాఫ్ సాగతీతగా ఉండటంతో ప్రేక్షకులు కొంత అసహనానికి గురయ్యారని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు: 

సూర్య నటన సినిమాకు ప్లస్ అయ్యింది.  ఎన్జీకే పాత్రలో ఒదిగిపోయి నటించాడు సూర్య.  రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినపుడు కార్యకర్త ఎలా ఉంటాడు... అన్నది చక్కగా చూపించారు.  అలాగే సాయి పల్లవి పాత్ర చాలా సహజంగా ఉంది.  రకుల్ ప్రీత్ చక్కగా నటించింది.  మిగిలిన పాత్రల్లో మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

సెల్వ రాఘవన్ గత చిత్రాలను పోలిస్తే ఈ సినిమా డిఫరెంట్ గా ఉంది.  రాజకీయాలకు సంబంధించిన సినిమా కలగడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  కానీ, సెల్వరాఘవన్ అనుకున్న విధంగా కథను డీల్ చేయలేకపోయాడు.  సెకండ్ హాఫ్ లో కథను ఇంకాస్త బలంగా చెప్పి ఉంటె సినిమా మరోరకంగా ఉండేది.  యువన్ శంకర్ రాజా సంగీతం, శివకుమార్ విజయన్ కెమెరా పనితనం సినిమాకు ప్లస్ అయ్యాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

సూర్య నటన 

కథ, కథనాలు 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ సాగతీత 

చివరిగా : చప్పగా సాగిన రాజకీయం కథ