ఎన్జీకే ట్రైలర్ టాక్ - వస్తున్నా... చూడు...

ఎన్జీకే ట్రైలర్ టాక్ - వస్తున్నా... చూడు...

ఎన్జీకే ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  సూర్యను పొలిటిషియన్ చూపిస్తూ తీసిన ఈ సినిమా ట్రైలర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  ఫిదా హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నది.  

నంద గోపాల కృష్ణగా మూడు వేరియేషన్స్ లో సూర్య కనిపిస్తున్నాడు.  సాధారణ వ్యక్తి నుంచి రాజకీయాలను శాసించే వ్యక్తిగా ఎలా మారాడు అన్న కథతో ఈ సినిమా తెరకెక్కితుంది.  ట్రైలర్ రిలీజైన కొద్దిసేపటికే 5 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా దర్శకుడు.