ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ కీలక ఆదేశాలు 

ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ కీలక ఆదేశాలు 

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్-ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. నదుల అనుసంధానానికి అవసరమైన పర్యావరణ అనుమతులు లేవని స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీటీలో వట్టి వసంతకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన ఎన్‌జీటీ.. అన్ని అనుమతులు వచ్చేవరకు పనులను చేపట్టరాదని ఆదేశించింది. నదుల అనుసంధానంపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇవ్వకపోవడంపై ఎన్‌జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కూడా అంగీకరించింది.