ఏపీ సర్కార్‌కు రూ. 100 కోట్ల జరిమానా..

ఏపీ సర్కార్‌కు రూ. 100 కోట్ల జరిమానా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానాగా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... కృష్ణానది దగ్గర,  సీఎం నివాసం  సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని దీనిపై నివేదికలు అందజేశాయి కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు... అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు వాటర్ మాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ.. ఆ పిటిషన్‌ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది.