శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు ఎన్‌ఐఏ కోర్డులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌ జ్యూడిషీయల్‌ రిమాండ్‌ ఇవాల్టితో ముగియనున్న విషయం తెలిసిందే. తనకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్సం కోసం బెయిల్‌ మంజూరు చేయాలని శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. నిందితుడు శ్రీనివాస్ కు ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. బెయిల్ పిటీషన్ పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి.