వ్యభిచారం కోసం బంగ్లాదేశ్ నుండి...దేశంలోనే మొదటిసారిగా !

వ్యభిచారం కోసం బంగ్లాదేశ్ నుండి...దేశంలోనే మొదటిసారిగా !


దేశంలో మొదటి సారి మనుషుల అక్రమ రవాణా మీద ఎన్ ఐ ఎ కేసు నమోదు చేసింది. మొత్తం ఆరుగురు మీద ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు 2019లో ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. వ్యభిచార ముఠా నుంచి బంగ్లాదేశ్ అమ్మాయిలను పోలీసులు రక్షించారు.

అయితే హైదరాబాదులో పనులున్నాయని చెప్పి బంగ్లాదేశ్ అమ్మాయిలను ముఠా తీసుకు వస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ చేరుకున్నాక బలవంతంగా ఈ ముఠా వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ముఠా బారిన పడ్డ యువతుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ నుంచి పెద్దమొత్తంలో అమ్మాయిలను తీసుకొచ్చి ఈ  ముఠా వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు.