కిడారి హత్య కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్..

కిడారి హత్య కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్..

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది ఎన్‌ఐఏ. విజయవాడలోని కోర్టులో ఎన్‌ఐఏ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. గత ఏడాది ఆగస్టులో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమను హత్య చేశారు మావోయిస్టులు. సానుభూతిపరుల సహకారంతో మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ కేసులో ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలపై అభియోగాలు నమోదు చేశారు. మావోయిస్టులతో టచ్‌లో ఉండి కిడారి కదలికలను సుబ్బారావు ఎప్పటికప్పుడు వారికి తెలిపేవాడని తేల్చారు. సానుభూతిపరులు ఇచ్చిన సమాచారంతోనే కిడారితో పాటు సోమును టార్గెట్ చేసి హత్యచేశారు మావోయిస్టులు.