కలకలం సృష్టిస్తున్న ఎన్ఐఏ సోదాలు

కలకలం సృష్టిస్తున్న ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ లో ఐసిస్ ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్, వార్దాలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, రెండు లాప్ టాప్ లు, ఆరు పెన్ డ్రైవ్ లు, వాకీటాకీలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. గతంలో పట్టుబడిన బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి ఎన్‌ఐఏ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ యువకుడి (తహన్‌)ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహన్‌ను గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

పక్కా ఆధారాలతోనే అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాడ్యుల్‌ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం​ ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్‌ఎస్సెస్‌ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్‌ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది.

ఆర్‌ఎస్సెస్‌ నాయకుడి హత్యకు ఢిల్లీ వెళ్లిన బాసిత్‌, నలుగురు యువకులకు ఏకే 47లను ఐసిస్‌ సమకూర్చింది. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్ట్‌ చేయడంతో.. ప్లాన్‌ విఫలమైంది. దీంతో బాసిత్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్‌లో బాసిత్‌ పాటు మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.