ఐసిస్‌తో హైదరాబాదీకి లింక్‌..? ఒకరి అరెస్ట్‌!

ఐసిస్‌తో హైదరాబాదీకి లింక్‌..? ఒకరి అరెస్ట్‌!

హైదరాబాద్ నగర శివార్లలో ఇవాళ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కుట్ర కేసు సంబంధించి హైదరాబాద్‌లో 8 మంది అనుమానితుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన యువకుడి పేరు తాహా అని తెలిసింది. నగరంలోని కింగ్స్‌ కాలనీకి ఆరు నెలల క్రితం ఇతను వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానిక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఎన్‌ఐఏ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ కుట్ర కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది ఉగ్రవాదులను ఇదివరకే ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.