హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాల కలకలం

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాల కలకలం

హైదరాబాద్ నగర శివార్లలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ కుట్ర కేసు సంబంధించి హైదరాబాద్‌లో 8 మంది అనుమానితుల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. స్థానిక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఎన్‌ఐఏ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైలార్‌దేవ్‌పల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ కుట్ర కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.