పుట్టినరోజునాడు కూడ పనిచేస్తున్న హీరోయిన్ !

పుట్టినరోజునాడు కూడ పనిచేస్తున్న హీరోయిన్ !

సాధారణంగా చాలా మంది హీరోయిన్లు తన పుట్టినరోజుల్ని కొంత ప్రత్యేకంగానే జరుపుకుంటుంటారు.  షూటింగ్స్  అన్నిటికీ చెక్ పెట్టి కుటుంబంతోనో లేకపోతే ఫ్రెండ్స్ తో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు.  కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం పుట్టినరోజునాడు కూడ పనిచేస్తూనే ఉంటారు. 

అలాంటి వాళ్లల్లో నిధి అగర్వాల్ కూడ ఒకరు.  ఆమె నాగ చైతన్య, చందూ మొండేటిల 'సవ్యసాచి'లో కథానాయకిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ హైదరాబాద్లో జరుగుతోంది.  ఇప్పటికే సినిమా పూర్తవడం ఆలస్యమైంది. అందుకే ఆమె తన పుట్టినరోజు వేడుకల్ని పక్కనబెట్టి షూట్లో పాల్గొంటున్నారు.  ఒక యువ హీరోయిన్ వర్క్ పట్ల ఇంత డెడికేషన్ చూపడం నిజంగా అభినందించదగిన విషయమే.