అక్కినేని హీరోయిన్ కు ఫుల్ డిమాండ్ !

అక్కినేని హీరోయిన్ కు ఫుల్ డిమాండ్ !

అక్కినేని యువ హీరోలు నాగ చైతన్య 'సవ్యసాచి'తో అఖిల్ 'మిస్టర్. మజ్ను'తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ రెండు సినిమాల్లోనూ హిందీ హీరోయిన్ నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.  ఇలా తెలుగులో అడుగు పెట్టిన మొదట్లోనే నిధికి ఇద్దరు స్టార్ హీరోలు, అదీ అన్నదమ్ములతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ రావడం విశేషం. 

ఇప్పటికే రిలీజైన 'సవ్యసాచి' ట్రైలర్, టీజర్లలో నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేసింది.  అందుకే ఆఫర్లు ఆమె తలుపుతడుతున్నాయట.  ఒకవేళ అక్కినేని హీరోల రెండు సినిమాలు మంచి హిట్లుగా నిలిస్తే ఆమె డిమాండ్ మరింతగా పెరిగుతుందనడంలో సందేహమే లేదు.