నిలకడగా ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిఫ్టి 23 పాయింట్ల నష్టంతో 10,957 వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఇతర కౌంటర్లలో ట్రేడింగ్ నిస్తేజంగా సాగింది. హిందాల్కో త్వరలోనే అలెరిస్ కంపెనీని 250 కోట్ల డాలర్లతో కొనుగోలు చేయనుందనే వార్తలతో ఆ కంపెనీ షేర్ 6శాతం పైగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మళ్ళీ బలహీనపడి 69ని దాటింది. పెరిగిన నిఫ్టి షేర్లలో టైటాన్ అ్రగస్థానంలో ఉంది. ఈ షేర్ 3 శాతం లాభపడగా, ఎస్ బ్యాంక్, వేదాంత, రిలయన్స్ షేర్లు రెండు శాతం లాభపడ్డాయి. ఇక భారతీ ఎయిర్టెల్ కూడా దాదాపు రెండు శాతం పెరిగింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హిందాల్కో 6శాతం క్షీణించగా, కొటక్ బ్యాంక్ నాలుగు శాతం తగ్గింది. ఎల్ అండ్ టీ, సిప్లా, రెడ్డీస్ ల్యాబ్ షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు అదాని పవర్ 8 శాతం పెరగ్గా, పీసీ జ్యువెల్లర్స్ 8 శాతం క్షీణించింది. అలాగే అశోక్ లేల్యాండ్ మరో నాలుగు శాతం, మైండ్ ట్రీ 8 శాతం క్షీణంచింది.కొటక్ బ్యాంక్ కూడా నాలుగు శాతం తగ్గింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)