లాభాల్లో ముగిసిన నిఫ్టి
ఆసియా మార్కెట్లు ఇచ్చిన ఉత్సాహంతో నిప్టి 11,000పైన లాభాల్లో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 53 పాయింట్లు పెరిగి 11,010 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా మార్కెట్లు రెండు శాతంపైగా లాభపడ్డాయి. మన మార్కెట్లు కూడా ఉదయం నష్టాల నుంచి కోలుకున్నా.. మిడ్ సెషన్కల్లా మళ్ళీ లాభపడ్డాయి. యూరో మార్కెట్ల ట్రెండ్ నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు క్లోజింగ్లో పెరిగాయి. ఐటీ, ఫార్మా, రియాల్టి సూచీలు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. చక్కటి పనితీరు కనబర్చిన బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 8 శాతం పెరిగి 2,721 వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్ కూడా 5.77 శాతం పెరిగింది. సన్ ఫార్మా మూడు శాతం, ఇన్ఫోసిస్ 2.6 శాతం, సిప్లా రెండున్నర శాతం పెరిగింది. మరోవైపు భారీగా నష్టపోయిన నిఫ్టి షేర్లలో బజాజ్ ఆటో ముందుంది. ఈ షేర్ 9.5 శాతం నష్టపోయింది. హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అలాగే వేదాంత కూడా రెండున్నర శాతం క్షీణించింది. పీసీ జ్యువెల్లర్స్ ఇవాళ మరో 20 శాతం క్షీణంచగా, అదానీ పవర్ పది శాతం పడింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)