నిలకడగా ముగిసిన నిఫ్టి

నిలకడగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్న నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ముగిసింది. సెషన్‌ మధ్యలో అక్కడక్కడా కాస్త ఒత్తిడి వచ్చినా నిఫ్టి నిలదొక్కుకుంది. ఆసియా మార్కెట్లు నామమాత్రపు లాభనష్టాలతో ముగిశాయి. అదే ట్రెండ్‌ యూరప్‌లో కొనసాగుతోంది. నిఫ్టి రెండు పాయింట్ల నష్టంతో 11,132 పాయింట్ల వద్ద ముగిసింది. పీఎస్‌యూ బ్యాంకుల సూచి ఒకశాతంపైగా లాభపడగా మెటల్స్‌ సూచీ కూడా గ్రీన్‌లో ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ మూడు శాతం లాభపడగా.. బజాజ్‌ ఫిన్ సర్వ్‌, ఎస్‌బీఐ, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ఒక శాతం నుంచి రెండు శాతం మధ్య లాబపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఎన్‌టీపీసీ నాలుగు శాతం క్షీణించింది. లుపిన్‌ మూడు శాతం తగ్గగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు రెండు శాతంపైగా క్షీణించాయి.