రికార్డు స్థాయిలో ముగింపు

రికార్డు స్థాయిలో ముగింపు

ఆగస్టు సిరీస్‌ భారీ లాభాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లు ఉదయం ఊగిసలాడాయి. అమెరికా మార్కెట్లు డల్‌గా ముగియడమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా చైనా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా.. హాంగ్‌సెంగ్‌ క్రితం ముగింపు వద్దే ముగిసింది. జపాన్‌ నిక్కీ మాత్రం అరశాతం పెరిగింది. ఇదే ధోరణి మన మార్కెట్లో కన్పించింది. ఉదయం ఏకంగా 65 పాయింట్ల లాభంతో మొదలైన.. తరవాత కొత్త గరిష్ఠ స్థాయిలను తాకింది. నిఫ్టిపై ఒకదశలో ఒత్తిడి కన్పించినా.. దేశీయ ఫండ్ల నుంచి మద్దతు   ఉండటంతో అవే లాభాలను కొనసాగాయి. మరోవైపు మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్ల ఉత్సాహంతో కొత్త శిఖరాలను అధిరోహించింది. నిఫ్టి 111 పాయింట్ల లాభంతో 11,278 పాయింట్ల వద్ద క్లోజవగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 352 పాయింట్ల లాభంతో 37,336 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీసీ 5 శాతం లాభ పడగా, ఐఓసీ నాలుగు శాతం పెరిగింది. టాటా మోటార్స్‌ కూడా 4 శాతం లాభపడింది. హిందాల్కో, టైటాన్‌లు కూడా మూడు శాతం పైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఉంది. ఈ షేర్‌ రెండు శాతంపైగా నష్టపోయింది. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌ షేర్లు ఒక శాతం వరకు తగ్గగా, కోల్‌ ఇండియా అరశాతం పైగా క్షీణించింది. బయోకాన్‌ కూడా నాలుగున్నర శాతం లాభంతో ముగిసింది.