చరిత్ర సృష్టించిన నిఫ్టి

చరిత్ర సృష్టించిన నిఫ్టి

స్టాక్ మార్కెట్ లో కొత్త అధ్యాయాన్ని లిఖించింది నిఫ్టి. అన్ని రంగాల షేర్లకు గట్టి మద్దతు అందడం, అంతర్జాతీయ మార్కెట్లన్నీ గ్రీన్ లోఉండటంతో పాటు రూపాయి బలపడటం కారణంగా స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయి లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 135 పాయింట్ల లాభంతో 11,691 వద్ద ముగిసింది. షేర్ మార్కెట్ చరిత్రలో నిఫ్టి ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. నిఫ్టిలోని 50 షేర్లలో 47 షేర్లు  లాభాల్లో ముగియడం విశేషం. ఇవాళ్టి ర్యాలీ ప్రధానంగా బ్యాంకు షేర్ల ర్యాలీగా చప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టి 1.5 శాతం పెరిగింది. ఇందులో మెజారిటీ వాటా పీఎస్ యూ బ్యాంకులదే. నిఫ్టి ప్రధాన షేర్లలో పవర్ గ్రిడ్, హిందాల్కో, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి. ఇవన్నీ మూడు శాతంపైగా పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్లలో సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌ సర్వ్, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్ ఉన్నాయి. జేపీ అసోసియేట్స్ పై మార్కెట్ లో ప్రతికూల వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో ఈ షేర్‌ ధర 9.5 శాతం తగ్గింది.

20 శాతం పెరిగిన షేర్లు...

రాజ్ రేయాన్
కెఎస్ ఎస్ లిమటెడ్, 
ఎన్‌ ఇండస్ర్టీస్ 
డెల్టా మాగ్నెట్ ఉన్నాయి.