భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

బ్యాంక్ నిఫ్టితో పాటు పలు కీలక ఎఫ్ ఎంసీజీ, రియాల్టి షేర్లలో లాభాల స్వీకరణతో నిఫ్టి భారీ నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు డల్ గా ఉండటంతో ఉదయం నిలకడగా ప్రారంభమైన మార్కెట్.. తరవాత క్షీణిస్తూ వచ్చింది. చైనా మ్యాన్యూ ఫ్యాక్చరింగ్ పీఎంఐ 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరడంతో మూడో రోజు చైనా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మిడ్ సెషన్ లో యూరప్ మార్కెట్లు కూడా వరుసగా మూడవ రోజు నష్టాల్లో ట్రేడ్ కావడంతో మన మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఎంపిక చేసిన కొన్ని ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ లాభాలతో ముగిసిన షేర్లలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నాలుగు శాతం లాభంతో అ్రగస్థానంలో ఉంది. విప్రో, ఐషర్ మోటార్స్, టైటాన్, హెచ్ పీసీఎల్ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో బజాజ్ ఫైనాన్స్ ముందుంది. ఈ కౌంటర్ 5శాతం నష్టపోగా.. హిందుస్థాన్ యూనిలివర్ 4.5 శాతం తగ్గింది. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకులు మూడు శాతం దాకా తగ్గాయి. ఐటీసీ కూడా రెండున్నర శాతం క్షీణించింది.