11,000పైన ముగిసిన నిఫ్టి

11,000పైన ముగిసిన నిఫ్టి

నిఫ్టి రికార్డు స్థాయిలో 11,000పైన ముగిసింది. ఉదయం నుంచి మార్కెట్‌కు గట్టి మద్దతు అందింది. ఆసియా మార్కెట్లు ఆరంభం నుంచి భారీ లాభాలు గడించాయి.మిడ్‌ సెషన్‌లో ఒకదశలో దాదాపు 90 పాయింట్లకుపైగా పెరిగిన నిఫ్టి అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి 75 పాయింట్ల లాభంతో 11,023 పాయింట్ల లాభంతో ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఇవాళ నిఫ్టి షేర్లలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. 11 ఏళ్ళ తరవాత మళ్ళీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 100 బిలియన్‌ డాలర్లను దాటింది. అలాగే ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు రావడంతో లుపిన్, అలెంబిక్‌ ఫార్మా షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో బీపీసీఎల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ షేర్లు కూడా లాభాలతో ముగిశాయి. నిఫ్టి గెయినర్స్‌లో రిలయన్స్‌ నాలుగు శాతం లాభంతో 1080 వద్ద ముగిసింది. బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఉన్నాయి. ఇవన్నీ రెండు శాతంపైగా లాభపడ్డాయి. ఇక నిఫ్టి షేర్లలో నష్టపోయిన షేర్లు కూడా అదే స్థాయిలో పడ్డాయి. యూపీఎల్‌ నాలుగు శాతంపైగా పడితే, వేదాంత మూడు శాతం, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ రెండు శాతం క్షీణించాయి. అలాగే గ్రాసిం కూడా ఇదేస్థాయిలో క్షీణించింది. అదానీ పవర్ నాలుగున్నర శాతం క్షీణించగా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఆరు శాతం లాభపడింది.