11600పైన ముగిసిన నిఫ్టి

11600పైన ముగిసిన నిఫ్టి

ఏప్రిల్‌ సిరీస్‌ శుభారంభం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో పాటు మార్చి రోలోవర్‌ ప్రోత్సాహకరంగా ఉండటంతో ఇవాళ మార్కెట్‌లో కొనుగోళ్ళ మద్దతు కొనసాగింది. బ్యాంకులు మాత్రం ఇవాళ్టి ర్యాలీకి దూరంగా ఉన్నాయి. అమెరికా, వాణిజ్య చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నట్లు వార్తలు వస్తుండటంతో రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం యూరో మార్కెట్లన్నీ అరశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ కూడా పెరిగింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి నిలకడగా ఉంది. ఎన్‌ఎస్‌ఈ షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఆరు శాతం), వేదాంత, గ్రాసిం, యూపీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు మూడు శాతంపైగా పెరిగాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో గెయిల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు ముందున్నాయి. ఇతర షేర్లలో ఆర్‌ పవర్‌ 6 శాతంపైగా పెరిగింది. ఇక బీఎస్‌ఇ సెన్సెక్స్‌లో సెరా 14 శాతం, ఇండోస్టార్‌ 11 శాతం పెరిగాయి. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ (పీపీ) జిందాల్‌ స్టీల్‌ షేర్లు 9 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌లో నష్టపోయిన టాప్‌ లూజర్స్‌లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ 6 శాతంపైగా నష్టపోయాయి. ఆర్‌ కామ్‌, సుజ్లాన్‌, బజాజ్‌ హోల్డింగ్‌ సేర్లు 4 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి.