నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఒకదశలో దాదాపు వంద పాయింట్లకు పైగా నష్టపోయిన నిఫ్టి చివర్లో కోలుకుని 61 పాయింట్ల నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటు బీజేపీ మేనిఫెస్టో సాదాసీదాగా ఉండటంతో మార్కెట్‌లో ఉత్సాహం తగ్గింది. బ్యాంక్‌ నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి రావడంతో ఒకదశలో 350 పాయింట్లు నష్టపోయింది. తరవాత కోలుకున్నా... 294 పాయింట్ల నష్టంతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి తరవాత 11549కి పడిపోయింది. తరవాత కోలుకుని క్లోజింగ్‌లో 11604 వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు ఒక మోస్తరు లాభంతో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

ఇక టాప్‌ లూజర్స్‌లో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఐఓసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంత, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు ఉన్నాయి. ఇతర షేర్లలో డీఎల్‌ఎఫ్‌ 9 శాతం క్షీణించగా, ఐడియా ఆరున్నర శాతం పెరిగింది. సౌత్‌ ఇండియా బ్యాంక్‌ ఒక దశలో 5 శాతం పెరగ్గా, క్లోజింగ్‌లో అర శాతం నష్టంతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో జై కార్పొరేషన్‌ 13 శాతం, టాటా స్టీల్‌ (పీపీ) పది శాతం, మోతిలాల్‌ ఓఎఫ్‌ఎస్‌ 8 శాతం పెరిగాయి. ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 7 శాతం, జీడీఎల్‌ కూడా ఇదే స్థాయలో లాభంతో ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాపర్స్‌గా... బలరామ్‌పూర్‌ చినీ, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఆర్‌ కామ్‌  నిలిచాయి.