లాభాల నుంచి నష్టాల్లోకి నిఫ్టి

లాభాల నుంచి నష్టాల్లోకి నిఫ్టి

ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి తరవాత భారీగా నష్టపోయింది. మిడ్‌ సెషన్‌ తరవాత మళ్ళీ  కోలుకుని లాభాల్లో వచ్చినా... చివర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 34 పాయింట్ల నష్టంతో 11,752 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 69 పాయింట్ల లాభంతో ఇవాళ ఉదయం  నిఫ్టి  11856 వద్ద ప్రారంభమైంది. తరవాత ప్రైవేట్‌ బ్యాంకుల్లో వచ్చిన భారీ అమ్మకాలకు ప్రభుత్వ బ్యాంకులు కూడా తోడు కావడంతో నిఫ్టి 11738 పాయింట్లకు అంటే వంద పాయింట్లుకు పైగా క్షీణించింది.

మిడ్‌ సెషన్‌లో కోలుకున్న నిఫ్టి సరిగ్గా లాభాల్లోకి వచ్చి 11,790కి చేరింది. బ్యాంకు షేర్లలో ఒత్తిడి మళ్ళీ రావడంతో 11752 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్‌ సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. పైకి సూచీలు పెరుగుతున్నా... మధ్య తరహా,చిన్న షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఎన్నికల అనిశ్చితి మొదలైందా అన్న అనుమానం మార్కెట్‌ వర్గాల్లో కన్పిస్తోంది. అయితే టెక్నికల్‌ అనలిస్టులు మాత్రం నిప్టి 12,000 స్థాయిని సునాయాసంగా దాటుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరో కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గినా.. డాలర్‌తో రూపాయి విలువలో పెద్దగా తేడా లేదు.

నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌:

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, విప్రో.

నిఫ్టి టాప్‌ లూజర్స్‌ః

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బ్యాంక్‌, హిందాల్కో, వేదాంత, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌ః
జీఐసీ, బలరామ్‌పూర్‌ చినీ, ఇప్కా ల్యాబ్‌, మిందా ఇండస్ట్రీస్‌, రిలాక్సో.

సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌:
జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌ పవర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, టాటా స్టీల్‌ (పీపీ) దీవాన్‌ హౌసింగ్‌.