భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

ట్రంప్‌ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే సుమారు 20,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై ఇపుడున్న పది శాతం సుంకాన్ని 25 శాతానికి పెంచడమే గాక, మరో 35,000 కోట్ల డాలర్ల వస్తువులపై 25 శాతం సుంకం వేస్తానని ట్రంప్‌ హెచ్చరించడంతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఉదయం ప్రారంభమైన చైనా మార్కెట్లు 5 నుంచి 7 శాతం వరకు నష్టంతో క్లోజయ్యాయి. ఇక మిడ్‌ సెషన్‌ లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా దాదాపు 2 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఈ మార్కెట్లతో పోలస్తే మన మార్కెట్లు చాలా పటిష్ఠంగా ఉన్నట్లే లెక్క. ఉదయం 11605 పాయింట్ల వద్ద అంటే 105 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత దాదాపు ఇదే స్థితిలో కొనసాగింది. ఒకదశలో 11632 పాయింట్లకు చేరినా... సెషన్‌ చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి 11571 పాయింట్లకు పడిపోయింది. ఎట్టకేలకు క్రితం ముగింపుతో పోలిస్తే 114 పాయింట్ల నష్టంతో 11598 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 362 పాయింట్లు తగ్గింది. ఒక్క ఐటీ మినహా అన్ని సూచీలు రెడ్‌లో ముగిశాయి. మెటల్‌, మీడియా సూచీలు రెండు శాతం క్షీణించగా, బ్యాంకింగ్‌, ఆటో వంటి కీలక రంగాల సూచీలు కూడా ఒక శాతంపైగా తగ్గాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా ఉన్న  షేర్లు... బీపీసీఎల్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఉన్న నిఫ్టి షేర్లు ఇవిః జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైటాన్‌, ఎస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌.

  • బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌.... పీసీ జ్యువల్లర్స్‌, టాటా కెమికల్స్‌, రేమాండ్‌, బిర్లా కార్పొరేషన్‌, ఆర్‌ కామ్‌.
  • టాప్‌ లూజర్స్‌... టాటా స్టీల్‌ (పీపీ) నవకార్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌.